KSS PRASAD Final (Updated Feb 8th)ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ వచ్చేసింది.. మీ టాక్స్ ఎంతో లెక్క వేసుకోండి..

KSS PRASAD Final  (Updated Feb 8th)ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ వచ్చేసింది.. మీ టాక్స్ ఎంతో లెక్క వేసుకోండి..

Flash.. Download KSS Prasad Final Income Tax Software Updated on December 27th.

Download Here  (Dec 27th)

Download Link 2

ప్రతి ఒక్క ఎంప్లాయి లేదా ఆదాయం పొందేవారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల వచ్చేసరికి తన ఆదాయ పన్ను ఎలా లెక్కించాలి తన ఏడాది ఆదాయానికి ఎంత పన్ను పడుతుంది, పన్ను మినహాయింపులు ఏంటి అనేటువంటి లెక్కలు వేసుకొని వారి యొక్క ఇన్కమ్ టాక్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం అవసరం.

ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన యొక్క ఆదాయ పన్నుని క్యాలిక్యులేట్ చేసుకొనుట కొరకు మనకి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇన్కమ్ టాక్స్ ఇండియా అనే వెబ్సైట్లో కూడా అధికారికంగా మనం మన యొక్క ఆదాయం పన్ను లెక్కించుకోవడానికి అవకాశం కూడా ఉంది. కానీ మనకి ఈజీగా ఎక్సెల్ లో మన ఆదాయప్పను లెక్కించుకోవడానికి చాలామంది నిపుణులు ఎక్సెల్ లోనే సాఫ్ట్వేర్ తయారుచేసి చాలా ఈజీగా మన యొక్క ఆదాయప్పను లెక్క వేయుటకు అవకాశం కల్పిస్తున్నారు.

వీరిలో మనం చెప్పుకోదగిన వారు కేఎస్ఎస్ ప్రసాద్ అనేవారు. ఈయన ప్రతి ఏడాది ఉద్యోగులకి అతి సులువుగా టాక్స్ లేక్కించడం అనే ఎక్సెల్ సాఫ్ట్వేర్ ని చాలా యూజర్ ఫ్రెండ్లీగా తయారుచేసి అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానకి ఈయన ఆదాయపన్ను లెక్కింపు సాఫ్ట్వేర్ ని తయారు చేసి ట్రైన్ ని రిలీజ్ చేశారు ఈ ట్రైలర్స్ ని మనం వాడుకొని మన ఆదాయం టాక్స్ ఎంతో చూసుకోవచ్చు.

ఇవే కాకుండా  చాలామంది నిపుణులు వాళ్ళ యొక్క ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు teacherinfo.in మీకు అందిస్తూ వారి యొక్క అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ని కూడా ఈ యొక్క పేజీలో మీకోసం అందించడం జరుగుతుంది.

ఆదాయపు పన్నును ఎలా లెక్కించాలి?

జీతం పొందినవారికి ఆదాయపు పన్ను లెక్కింపు

Flash...   Cash Limit: IT రూల్స్ ప్రకారం ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు? తప్పక తెలుసుకోండి..

జీతం నుండి వచ్చే ఆదాయం అనేది ప్రాథమిక జీతం + HRA + ప్రత్యేక అలవెన్స్ + రవాణా భత్యం + ఏదైనా ఇతర భత్యం. మీ జీతంలోని కొన్ని భాగాలు టెలిఫోన్ బిల్లుల రీయింబర్స్‌మెంట్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి పన్ను నుండి మినహాయించబడ్డాయి. మీరు హెచ్‌ఆర్‌ఏ పొంది, అద్దెపై నివసిస్తున్నట్లయితే, మీరు హెచ్‌ఆర్‌ఏపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ HRA కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం ద్వారా HRA యొక్క మినహాయింపు భాగాన్ని లెక్కించండి.

ఈ మినహాయింపుల పైన, బడ్జెట్ 2018లో రూ. 40,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టబడింది. ఇది బడ్జెట్ 2019లో రూ. 50,000కి పెంచబడింది మరియు 2023 బడ్జెట్‌లో, కొత్త పాలన విషయంలో కూడా 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ఈ మినహాయింపులు మీకు అందుబాటులో ఉండవు.