లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
LIC ఆఫ్ ఇండియా (ఏజెంట్) నిబంధనలు, 2017కి సవరణల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ నిబంధనలను ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా (ఏజెంట్) సవరణ నిబంధనలు, 2023గా పరిగణిస్తామని ఎల్‌ఐసి తెలిపింది. అధికారిక పత్రాన్ని (అధికారిక గెజిట్) ప్రచురించిన తర్వాత పెంపు డిసెంబర్ 6 నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. సెప్టెంబరులో,
ఎల్‌ఐసి ఏజెంట్లు మరియు ఉద్యోగుల ప్రయోజనం కోసం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పెన్షన్ వంటి వివిధ సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తిరిగి నియమించబడిన ఏజెంట్లు కూడా పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు. ప్రస్తుతం LIC ఏజెంట్లు ఏ పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు కాదు.
ప్రస్తుతం ఎల్‌ఐసీకి 25 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. దాదాపు 12 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.1 లక్షల కోట్లు.