Mahalaxmi: 28వ తేది నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్.

Mahalaxmi: 28వ తేది నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్.

హైదరాబాద్ – మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.

ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో ఎంత మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు,

ఎవరికి ఈ పథకం వర్తింపజేయాలి అనేది నిర్ణయించబడుతుంది. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని లెక్కలు వేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

నెలా నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే, రాష్ట్రంలో మహిళల పేరుతో సుమారు 70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, గ్యాస్ కనెక్షన్ కోసం ‘పేరు మార్పు’ ఎంపిక ఉంది, తద్వారా ఇతర వినియోగదారులు తమ పేరును మార్చుకోవచ్చు.

ఈ క్రమంలో గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను సబ్సిడీ ధరకు అందజేస్తారు

Flash...   LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!