Smart Rist E: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. ధర కేవలం.

Smart Rist E: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. ధర కేవలం.

Smart Rist E: Smart watch with stunning looks.. Price is just.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎలిస్టా భారత్‌లో సరికొత్త Smart Watch‌ను విడుదల చేసింది.

‘SmartRist E’ సిరీస్‌లో భాగంగా, ఈ వాచ్‌ను మూడు వేరియంట్‌లలో విడుదల చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌రిస్ట్ ఈ-1, స్మార్ట్‌రిస్ట్ ఈ-2, స్మార్ట్‌రిస్ట్ ఈ-4 వేరియంట్‌లలో వాచీలను విడుదల చేశారు. ఈ వాచీలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ Smart Watch ధర రూ. 1299గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే, E-1 మరియు E-2 వాచ్‌లు 2.01-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ వాచ్ 240 x 296 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.

ఈ Smart Watch వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 రోజుల పాటు నాన్ స్టాప్ గా పని చేస్తుంది. వాచ్‌లో వాటర్ రెసిస్టెంట్ మెటాలిక్ ఫ్రేమ్ ఉంది.

ఈ Smart Watch‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందించబడింది. దీనితో, మీరు వాచ్ నుండి నేరుగా కాల్స్ చేయవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్ స్పీకర్‌, మైక్‌ను అందించారు. మరియు ఆరోగ్యం కోసం, Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, ఫిట్‌నెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి

Flash...   Battery Life Tips: మీ ఫోన్ బ్యాటరీ వీక్ అయ్యిందా? ఈ టిప్స్ పాటిస్తే లైఫ్ బాగా పెరిగిపోతుంది.. ట్రై చేయండి