TATA కార్​ కొనాలా? 2024 లో లాంఛ్ కానున్న 8 బెస్ట్ మోడల్స్ ఇవే!

TATA కార్​ కొనాలా? 2024 లో లాంఛ్ కానున్న 8 బెస్ట్ మోడల్స్ ఇవే!

2024లో రానున్న టాటా కార్లు :

కార్ ప్రియులందరికీ శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే ఏడాది వరుసగా 5 కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

అంతేకాదు 2025లో కూడా పలు సూపర్ మోడల్ కార్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆలస్యమెందుకు అన్నది ఒకసారి చూద్దాం.

2024లో రానున్న టాటా కార్లు : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్… ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. అందులో భాగంగానే 2024, 2025 సంవత్సరాల్లో కొత్తవి
బ్రాండ్ కార్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది

ట్రెండ్‌ ప్రకారం..

మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ యోచిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుంచి టర్బో ఛార్జ్‌డ్ హ్యాచ్‌బ్యాక్‌ల వరకు అన్ని రకాల కార్లను తయారు చేస్తోంది. కాబట్టి వాటిని ఒకసారి చూద్దాం.

2024లో విడుదల కానున్న టాటా కార్లు ఇవే!

1. టాటా పంచ్ EV ఫీచర్లు:

టాటా కంపెనీ ఈ పంచ్ ఎలక్ట్రిక్ కారును జనవరి 2024లో విడుదల చేయాలని యోచిస్తోంది. టాటా పంచ్ EV నేరుగా సిట్రోయెన్ EC3తో పోటీపడుతుంది. ఈ పంచ్ EV కారు గరిష్టంగా 500 కి.మీల రేంజ్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 360 కెమెరా ఫీచర్లు వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో EV నిర్దిష్ట డిజైన్ మార్పులు కూడా చేసినట్లు సమాచారం.

టాటా పంచ్ EV ధర: ఈ టాటా పంచ్ EV కారు ధర రూ.12 లక్షల పరిధిలో ఉండవచ్చు.

2. Tata Crvv EV ఫీచర్లు:

టాటా కంపెనీ ఈ కర్వ్ ఎలక్ట్రిక్ కారును మార్చి 2024 నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును మంచి డిజైన్ మరియు ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో తయారు చేసి ఆటో ఎక్స్‌పో-2023లో ప్రదర్శించింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఒకసారి పూర్తిగా రీఛార్జ్ చేసుకుంటే, అది 500 కి.మీల పరిధి వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. కాబట్టి భారతీయ కస్టమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Flash...   Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Tata Crvv EV ధర: ఈ టాటా కర్వ్ EV కారు ధర రూ.20 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.

3. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఫీచర్లు:

టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ రేసర్ కారును మార్చి 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మంచి స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా ఆల్ట్రోజ్ రేసర్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 120 బిపిహెచ్ పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లింకేజీని కలిగి ఉంది. ఈ కారు సాధారణ ఆల్ట్రోజ్ కార్ల మాదిరిగానే మంచి సన్‌రూఫ్, బ్లాక్-అవుట్ బానెట్ & రూఫ్‌ను కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ ధర: ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ధర దాదాపు రూ.10 లక్షలు ఉండవచ్చు.

4. టాటా Crvv ICE ఫీచర్లు:

టాటా మోటార్స్ ఈ కర్వ్ ICE వేరియంట్‌ను ఏప్రిల్ 2024లో విడుదల చేసే అవకాశం ఉంది. టాటా కంపెనీ ఈ కారును 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో తీసుకురానుంది. ఈ మధ్య-పరిమాణ SUV నేరుగా హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌తో పోటీపడుతుంది. అందుకే టాటా కంపెనీ దీన్ని మంచి సామర్థ్యంతో, సూపర్ పెర్ఫార్మెన్స్ తో రూపొందిస్తోంది.

Tata Crvv ICE ధర: ఈ టాటా కర్వ్ ICE కారు ధర రూ.10.50 లక్షల వరకు ఉండవచ్చు.

5. టాటా హారియర్ పెట్రోల్ ఫీచర్లు:

ఈ టాటా హారియర్ పెట్రోల్ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఇది కూడా 2024లోనే లాంచ్ అవుతుంది. టాటా కంపెనీ ఈ కారులో 1.5 లీటర్ TGDI నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని పొందుపరిచింది. ఇది 168 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనే ఆశ ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Flash...   Spl Casual Leave for electors on poll day for MLC Election

6. టాటా అవిన్య ఫీచర్లు:

టాటా మోటార్స్ కంపెనీ ఈ అవిన్య కారును జనవరి 2025లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టాటా అవిన్య ధర: ఈ టాటా అవిన్య కారు ధర రూ.30 లక్షల శ్రేణిలో ఉండవచ్చని అంచనా.

7. టాటా హారియర్ EV ఫీచర్లు:

టాటా కంపెనీ ఈ హారియర్ EV కారును ఏప్రిల్ 2025లో విడుదల చేయాలని యోచిస్తోంది.

టాటా హారియర్ EV ధర: ఈ టాటా హారియర్ EV కారు ధర రూ.30 లక్షల పరిధిలో ఉండవచ్చు.

8. టాటా సియెర్రా ఫీచర్లు:

ఈ టాటా సియెర్రా కారు డిసెంబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా సియెర్రా ధర: ఈ టాటా సియెర్రా కారు ధర దాదాపు రూ.25 లక్షలు ఉండవచ్చని అంచనా.

టాటా కార్ లైనప్:

టాటా మోటార్స్ కంపెనీ కైట్, అట్మోస్, హెచ్7ఎక్స్, ఆల్ట్రోజ్ ఈవీ, హెక్సా, ఎవిజన్ ఎలక్ట్రిక్ కార్లను కూడా లైన్‌లో ఉంచింది. ఇవన్నీ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.