వందేభారత్ రైల్లో త్వరలో స్లీపర్ క్లాస్ ..

వందేభారత్ రైల్లో త్వరలో స్లీపర్ క్లాస్ ..

ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ బోగీలను ముందుకు తీసుకెళ్లిన రైల్వే శాఖ.. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో మరింత అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వందే స్లీపర్ బోగీలను తీసుకువస్తోంది.

చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో రెండు.. విజయవాడ డివిజన్ కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ డివిజన్‌లో నడిచే సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై సెంట్రల్‌ రైళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

ఈ మార్గాల్లో స్లీపర్ క్లాస్ బోగీలతో నడిచే వందే భారత్ కు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ రైళ్లకు సంబంధించి ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ట్రాక్‌ల పటిష్టతను పెంచారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ప్రవేశపెట్టాలని భావించినా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

Flash...   Amazon సేల్‌ 2023.. JioBook Laptopపై ఫెస్టివల్‌ ఆఫర్‌..!