Tailoring Courses: టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

Tailoring Courses: టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ,  టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రభుత్వం ఫిబ్రవరి-2024లో నిర్వహించనున్న డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని DEO  భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత ధ్రువపత్రాలు, చలాన్‌లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 29లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ కు రూ.100, హయ్యర్ గ్రేడ్ కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ కు రూ.150, హయ్యర్ గ్రేడ్ కు రూ.200 పరీక్ష ఫీజు ఉంటుందని తెలిపారు.

పరీక్ష ఫీజును రూ.50 అపరాధ రుసుముతో వచ్చే నెల 5వ తేదీలోగా, రూ.75 అపరాధ రుసుముతో వచ్చే నెల 12వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. లోయర్ గ్రేడ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు అంతకంటే ఎక్కువ దరఖాస్తు చేసేవారు లోయర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

Flash...   SA 1 MODEL QUESTION PAPERS 2022