హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు :
అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2023 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.21,700 నుండి రూ.69,100 వరకు చెల్లించబడుతుంది.
ఉద్యోగ ప్రదేశం :
ఎంపికైన అభ్యర్థులు.. NRSC- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పూర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూఢిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పూర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు) వీటిలో ఏదైనా ఒక ప్రదేశంలో పనిచేయాలి.
Details of posts..
- Technician-B (Electronic Mechanic) Posts: 33
- Technician-B (Electrical) Posts: 8
- Technician-B (Instrument Mechanic) Posts: 9
- Technician-B (Photography) Posts: 2
- Technician-B (Desktop Publishing Operator) Posts: 2
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 09, 2023 నుండి ప్రారంభమయ్యాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ : డిసెంబర్ 31, 2023.
దరఖాస్తును పూరించే సమయంలో, రిజిస్ట్రేషన్ ఫీజు కింద దరఖాస్తు రుసుము కింద రూ.600 చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.