మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తుంటే బదిలీ చేయండి

మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తుంటే బదిలీ చేయండి

ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులను వారి సొంత జిల్లాల నుంచి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

అమరావతి: ఎన్నికల నిర్వహణకు సంబంధించి నేరుగా అధికారులు, ఉద్యోగులను వారి సొంత జిల్లాల నుంచే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు పనిచేసిన వారైతే అక్కడి నుంచి బదిలీ చేయాలని స్పష్టం చేశారు. 2024 జూన్ 30 నాటికి ఒకే జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్న వారికి ఆ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరాదని పేర్కొంది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుంది. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి 31 నాటికి పూర్తి చేసి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది.

అదనపు డీజీపీ నుంచి ఎస్సీఐకి: ఈ బదిలీలు పోలీసు శాఖలోని అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, కమాండెంట్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్-డివిజనల్ పోలీసు అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఎస్‌ఐలు మరియు ఆర్‌ఐలకు వర్తిస్తాయి. ఈ నిబంధనలు ఎక్సైజ్ శాఖలోని ఎస్సై, పై అధికారులకు వర్తిస్తాయని వివరించారు. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు, ఏఆర్‌ఓలు, ఈఆర్‌వోలు, ఈరోలతో పాటు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలకు డిప్యూటేషన్‌పై ఈ బదిలీ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది

Flash...   Health Care Tips: కారణం లేకుండానే నీరసంగా ఉంటుందా..