అర్హులైన అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వయోపరిమితి, అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం తదితర వివరాలను తెలుసుకోవడం ముఖ్యం
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 125
- ప్రొఫెసర్: 20 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 73 పోస్టులు
- అదనపు ప్రొఫెసర్: 10 పోస్టులు
- అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు
విభాగాలు
అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ENT, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ మొదలైనవి.
అర్హత
పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి
ప్రొఫెసర్ మరియు అదనపు ప్రొఫెసర్ ఖాళీలకు 58 సంవత్సరాలు మరియు ఇతర పోస్టులకు 50 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు; వికలాంగులకు 10 సంవత్సరాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఫ్యాకల్టీ ఇంచార్జి, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్ 216, 2వ అంతస్తు, లైబ్రరీ మరియు అడ్మిన్ బిల్డింగ్, AIIMS, మంగళగిరి, గుంటూరు అనే చిరునామాకు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29.01.2024.
దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 3,100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100. వికలాంగులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ
స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ కొనసాగుతుంది.