భారత మార్కెట్‌లో Apple ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ Virtual Reality హెడ్‌సెట్ ‘విజన్ ప్రో’ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Apple విడుదల చేయనున్న ఈ కొత్త హెడ్‌సెట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, ఆపిల్ కంపెనీ తన Virtual Reality హెడ్‌సెట్‌ను లాంచ్‌కు ముందే రిటైల్ స్టోర్‌లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే Februaryలో అధికారికంగా ప్రారంభించిన తర్వాతDeliveryలు ప్రారంభమవుతాయని సమాచారం.
విజన్ ప్రో హెడ్ సెట్ విక్రయాల కోసం Apple కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టిDeliveryలు ప్రారంభమైనప్పుడు రిటైల్ స్టోర్లలో ఇద్దరు లేదా ముగ్గురు శిక్షణ పొందిన ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్‌సెట్ వివరాలను వెల్లడిస్తారు.
Price:
2023 WWDC ఈవెంట్‌లో మొదటిసారి కనిపించింది, ఆపిల్ విజన్ ప్రో Februaryలో లాంచ్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. హెడ్‌సెట్‌లో M2 Chip Set మరియు రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్‌లు ఉన్నాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు. ఇది బాహ్య బ్యాటరీ ప్యాక్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ సరికొత్త హెడ్‌సెట్‌తో Virtual Realityని అనుభవించే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో USలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే ఈ హెడ్‌సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.