రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి.
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా అమెజాన్ డిస్కౌంట్ పేరుతో కస్టమర్లకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.
జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు జనవరి 14 నుంచి తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.
మొబైల్ ఫోన్లు, ఉపకరణాలు, స్మార్ట్ వాచ్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.
ABI క్రెడిట్ కార్డ్‌లు మరియు EMIలపై మరో పది శాతం తగ్గింపును అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం 12 గంటల ముందే సేల్ ప్రారంభమవుతుంది.
స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపులను అమెజాన్ ప్రకటించడంతో నెటిజన్లు సంబరాలు చేసుకుంటున్నారు. iPhone 13 ధర రూ. 59,999 మరియు రూ. 52,999కి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్ ఫోన్లను రూ.10 వేల తగ్గింపుతో విక్రయించనుంది.
ఆఫర్ల సమయంలో కొనుగోలు చేస్తే మరిన్ని డిస్కౌంట్లు పొందవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు