Credit Card New Rules: క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై కొత్త రూల్స్ . .

Credit Card New Rules: క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై కొత్త రూల్స్ . .

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక. కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు, ఏప్రిల్ 1 నుంచి మరికొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీకు చేదు వార్త. కొత్త సంవత్సరంలో షాకింగ్ న్యూస్. మీరు ఏమనుకుంటున్నారు? కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇది చాలా మందిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్త రూల్స్ తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పుడు బ్యాంక్ కొత్త రూల్స్ ఎవరిని ప్రభావితం చేస్తాయో చూద్దాం.

ఐసీఐసీఐ బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్చింది.ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్ బీఐ కార్డ్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ బాట పట్టిందని చెప్పొచ్చు.

బ్యాంక్ అనేక క్రెడిట్ కార్డ్‌లలో రివార్డ్ పాయింట్‌లను మార్చింది. అద్దె చెల్లింపులు మరియు ఈవాలెట్ లోడింగ్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు లేవు. ఈ రూల్ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.అయితే, Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

అలాగే బ్యాంక్ డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) రుసుమును ప్రవేశపెట్టింది. వచ్చే నెల 1 నుంచి డీసీసీ ఫీజు 1 శాతం చెల్లించాలి. పన్నులు జోడించబడతాయి. ఇది ప్రతికూల అంశం.

ఈ రుసుము అన్ని అంతర్జాతీయ లావాదేవీలకు వర్తిస్తుంది. అంటే మీరు విదేశాల్లో భారతీయ కరెన్సీలో చెల్లింపులు చేస్తే, మీరు ఈ రుసుమును చెల్లించాలి. అలాగే, విదేశీ స్థానాల్లో నమోదు చేసుకున్న భారతదేశంలోని వ్యాపారులకు చేసిన చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది.

యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్‌లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ప్రభుత్వ చెల్లింపులకు మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు వీటిపై కూడా రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

Flash...   అడ్మిషన్లు..? అయోమయం

ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నియమాలు కూడా మారుతాయి. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందాలనుకునే కస్టమర్‌లు ఇకపై కనీసం రూ. 35 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఒక కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త నిబంధనలు దాదాపు 21 క్రెడిట్ కార్డ్‌లకు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. బ్యాంకు తాజా నిర్ణయాల వల్ల చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.