Fire Boltt: ఇది స్మార్ట్‌ ఫోన్‌ తరహా ఫీచర్‌తో వస్తున్న స్మార్ట్‌ వాచ్‌..

Fire Boltt: ఇది స్మార్ట్‌ ఫోన్‌ తరహా ఫీచర్‌తో వస్తున్న స్మార్ట్‌ వాచ్‌..

Fire Bolt డ్రీమ్ పేరుతో ఈ వాచ్ ను తీసుకొచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 4G లైట్ నానో సిమ్ సపోర్ట్‌తో వచ్చిన మొదటి రిస్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ జనవరి 10 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది. ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో…

అయితే స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాచ్‌కి అర్థం మారిపోయింది. స్మార్ట్ ఫోన్ తో ఏం చేసినా వాచ్ తో చేసే రోజులు వచ్చాయి.

మారుతున్న టెక్నాలజీతో పాటు వాచీల పనితీరు కూడా మారుతోంది. ఒకప్పుడు గడియారం అంటే సమయం చూసేందుకు ఉపయోగించే సాధనం,


Fire Bolt డ్రీమ్ పేరుతో ఈ వాచ్ ను తీసుకొచ్చారు. ఫైర్ బోల్ట్ తర్వాత, ఇది ఆండ్రాయిడ్ 4G లైట్ నానో సిమ్ సపోర్ట్‌తో వచ్చిన మొదటి రిస్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ జనవరి 10 నుంచి మార్కెట్లో లభ్యం కానుంది.Fire Bolt అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Amazon లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ వాచ్ OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు గేమింగ్ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ 320 x 386 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 2.02 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే 600 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ వాచ్ క్వాడ్-కోర్ ARM కార్టెక్స్ A7MP SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 800mAh బ్యాటరీని కలిగి ఉంది. నాన్‌స్టాప్ వాడకంతో కూడా 24 గంటలు పని చేస్తుంది.

ఈ వాచ్‌లో హార్ట్ బీట్ రేట్, SpO2, ఫిట్‌నెస్ ట్రాకింగ్ మరియు వివిధ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ, Google Play Store యాక్సెస్ కూడా ఉన్నాయి. ఈ వాచ్ గేమ్‌లు OTT మాత్రమే కాకుండా Instagram మరియు WhatsApp వంటి సోషల్ మీడియా సైట్‌లతో పాటు షాపింగ్ యాప్‌లు మరియు ఫుడ్ డెలివరీ యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

Flash...   Promate Xwatch B2: ట్రెండీ ఫీచర్లతో పవర్‌ఫుల్ స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే..

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్మార్ట్ ఫోన్ లాంటి స్మార్ట్ వాచ్. అలాగే, ఈ వాచ్ ధూళి మరియు దుమ్ము నుండి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది.