Health Tips | ఈ రెండిటితొ చేసిన జ్యూస్ ముందు ఎంతటి ఎనర్జీ డ్రింకైనా దిగదుడుపే!

Health Tips | ఈ రెండిటితొ చేసిన జ్యూస్ ముందు ఎంతటి ఎనర్జీ డ్రింకైనా దిగదుడుపే!

ఆరోగ్య చిట్కాలు | ఎంత ఎనర్జీ డ్రింక్ తాగినా ఫర్వాలేదని పోషకాహార నిపుణులు అంటున్నారు అందుకు కారణాలున్నాయి.

క్యారెట్, బీట్రూట్… రెండూ దుంపలే. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ! ఈ రెండింటిని కలిపి తయారుచేసిన జ్యూస్ తాగితే…

ఈ Juice రక్తపోటును అదుపులో ఉంచుతుందని, బీట్రూట్లోని నైట్రేట్లు రక్తనాళాలను తెరచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. రెండింటిలోనూ ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కీళ్ల నుంచి ఊపిరితిత్తుల వరకు మంటకు సంబంధించిన సమస్యలు ఉండవు. బీట్రూట్, క్యారెట్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా బలపడుతుంది. ఇందులోని పోషకాలతో పాటు విటమిన్-ఎ, సి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

ఈ రెండూ కూడా సహజమైన డిటాక్స్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా, ఇది కాలేయం వంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ రసంతో చర్మం రంగు మెరుగుపడుతుందని… కొత్త మెరుపు వస్తుందని చెబుతున్నారు. ఈ జ్యూస్ని రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

Flash...   రైస్‌ వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!