IAF : ఇంటర్‌ అర్హతతో 3500 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.30,000 ప్రారంభ జీతం తో

IAF : ఇంటర్‌ అర్హతతో 3500 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.30,000 ప్రారంభ జీతం తో

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త. IAF Agniveer Recruitment లో భాగంగా 3500 పోస్టులను భర్తీ చేయనున్నారు.

IAF Agniveer Recruitment 2024

ఈ నోటిఫికేషన్ ద్వారా 3500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ https://agnipathvayu.cdac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు, దరఖాస్తు ప్రక్రియ జనవరి 17 నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 6 దరఖాస్తులకు చివరి తేదీ.

ముఖ్య సమాచారం:

వయోపరిమితి: ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు ఇంగ్లీషు తప్పనిసరిగా సబ్జెక్టులుగా ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీసం 50% మార్కులు తప్పనిసరి. లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డిప్లొమాలో కనీసం 50% మార్కులు తప్పనిసరి. ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లను నాన్‌కేషనల్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. సైన్స్ సబ్జెక్టులు కాకుండా కనీసం 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: దరఖాస్తుదారులు రూ.550 దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలక్షన్ బోర్డ్ టెస్ట్, మూడో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నాల్గవ దశలో అడాప్టబిలిటీ టెస్ట్-1, టెస్ట్-2 ఉంటాయి. ఐదవ మరియు ఆరవ దశల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

Flash...   Agniveer : ఇంటర్ అర్హత తో భారత్ వాయుసేన లో అగ్నివీర్ ఉద్యోగాలు .. అప్లై చేయండి

Salaries :

  • అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్‌కు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో నెలకు రూ.30,000,
  • రెండవ సంవత్సరంలో రూ.33,000,
  • మూడవ సంవత్సరంలో రూ.36,500 మరియు నాల్గవ సంవత్సరంలో రూ.40,000 జీతం లభిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ

ముందుగా అగ్నిపత్ అధికారిక పోర్టల్ https://agnipathvayu.cdac.in/ని తెరవండి.

Home Page కి వెళ్లి ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.

ఆ తర్వాత అప్లై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్లై చేయాలి.

ముందుగా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ చేసి అన్ని వివరాలను నమోదు చేయండి.

దరఖాస్తు రుసుము చెల్లించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించండి.