చాలా మంది వ్యాయామం చేయటం కొరకు ఉదయం లేదా సాయంత్రం జిమ్‌కి వెళ్తుంటారు. అయితే మనం ఇంట్లో చేసే కొన్ని పనులు చేయటం వాళ్ళ ఎలాంటి వ్యాయామం కూడా అవసరం లేదని మీకు తెలుసా?
ఫిట్ గా, యాక్టివ్ గా ఉండేందుకు వ్యాయామమే బెస్ట్ ఆప్షన్ అనిఅందరికి తెలుసు . ఇటీవల ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన చాలా పెరిగింది. దీంతో చాలా మంది వ్యాయామం చేసే విధానాన్ని మార్చుకుంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా జిమ్‌కి వెళ్తుంటారు. లేదా కనీసం థ్రెడ్ మిల్లు లేదా ఇంట్లో సైక్లింగ్ చేస్తూ ఉంటారు . అయితే మనం ఇంట్లో చేసే కొన్ని పనులకు ఎలాంటి వ్యాయామం కూడా అవసరం లేదని మీకు తెలుసా? అవును, మీరు కొన్ని సాధారణ ఇంటి పనులతో వ్యాయామం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకీ ఆ విషయాలు ఏంటి..
* ఇంటిని శుభ్రం చేయడం మంచి వ్యాయామం లాంటిది. ప్రస్తుతం ఇంటి పనులకు కూలీలను పెట్టుకుని బయట కసరత్తులు చేస్తున్నారు. కానీ అలా కాకుండా, ఇంటిని శుభ్రపరిచే కొన్ని పనులను స్వయంగా చేయడం మంచి వ్యాయామం. ముఖ్యంగా ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడుక్కోవడం ఉత్తమ వ్యాయామంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మీ చేతులు, కాళ్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. నిరంతరం వంగడం మరియు గది చుట్టూ తిరగడం మొత్తం శరీరాన్ని డైనమిక్‌గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. అధిక బరువు కూడా తగ్గుతుంది.
* గార్డెన్ వర్క్ కూడా అత్యుత్తమ వ్యాయామంగా చెప్పవచ్చు. మొక్కల సంరక్షణకు నీరు పెట్టడం, కలుపు మొక్కలను తొలగించడం, గడ్డి కోయడం, ఎరువులు వేయడం వంటివి అవసరం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ శరీరం మొత్తం డైనమిక్‌గా ఉంటుంది. వంగడం, తిరగడం, బరువులు ఎత్తడం వల్ల చేతులు, కాళ్ల కండరాలు బలపడతాయి. ఇవన్నీ కేలరీలను బర్న్ చేసే శక్తి-ఇంటెన్సివ్ కార్యకలాపాలు.
* మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామం కిందకు వస్తుంది . శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి మెట్లు ఎక్కడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రోజులో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు మెట్లు ఎక్కితే కాళ్ల కండరాలు దృఢంగా మారుతాయి. మెట్లు ఎక్కేటప్పుడు, మీ కాళ్ళు, వెన్ను మరియు తొడ కండరాలు బలంగా మారుతాయి.
* స్వయంగా బట్టలు ఉతకడం కూడా మంచి వ్యాయామం. మీ బట్టలు మీరే ఉతికిస్తే.. పూర్తి శారీరక వ్యాయామం అవుతుంది. బట్టలు ఉతకడం మరియు ఆరబెట్టడం వల్ల భుజాల కండరాలు పని చేస్తాయి మరియు తద్వారా భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు అలాంటి పనులు చేయడం ద్వారా సహజంగా మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.