మాల్దీవులు: హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం మాల్దీవులు ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. భారత్‌తో వివాదం, ప్రధాని నరేంద్ర మోదీపై ఆ దేశ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడటం వివాదాస్పదంగా మారింది.
మరోవైపు చైనాకు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వ్యవహరిస్తుండడంతో మాల్దీవులు అంతర్జాతీయ మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది.
ఇదిలా ఉంటే దేశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ దేశ పార్లమెంటులో ఎంపీల మధ్య వాగ్వాదం, ఒకరినొకరు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఆదివారం జరిగింది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజూ మంత్రివర్గాన్ని ఆమోదించడానికి పార్లమెంటు సమావేశమైంది.
అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి), ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పిపిఎం), ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండిపి) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పార్లమెంట్‌లోనే ఎంపీలు ఒకరినొకరు తన్నుకోవడం కనిపిస్తోంది. కొందరు ఎంపీలు పోడియం వద్ద గందరగోళం సృష్టించారు.
అధికార, ప్రతిపక్ష ఎంపీలను తమ ఛాంబర్లలోకి రానీయకుండా ఆయన అడ్డుకున్నారు. పార్లమెంటులో MDPకి మెజారిటీ ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యులను ముయిజూ మంత్రివర్గంలో చేరకుండా MDP అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పార్లమెంటు లోపల జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలో, ఎంపీలు నేలపై పడిపోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మరియు ఎంపీ జుట్టును లాగడం చూడవచ్చు. వీడియోలో ఉన్న ఇద్దరు ఎంపీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) ఎంపీ ఇసా మరియు పాలక PNC ఎంపీ అబ్దుల్లా షహీమ్ అబ్దుల్ హకీమ్.
*Viewer discretion advised*
Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s— Adhadhu (@AdhadhuMV) January 28, 2024