Motovolt URBN E-Scooter: ఈ-స్కూటర్‌కు నో లైసెన్సు .. ..నో రిజిస్ట్రేషన్‌.. సింగిల్ చార్జ్‌పై 120కి.మీ.

Motovolt URBN E-Scooter: ఈ-స్కూటర్‌కు నో లైసెన్సు .. ..నో రిజిస్ట్రేషన్‌.. సింగిల్ చార్జ్‌పై 120కి.మీ.

మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇంతకీ ఆ బైక్ ఏంటో చెప్పలేదు.. దాని పేరు URBN ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని మోటోవోల్ట్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది. దీని ధర రూ. 49,999. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 999 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ URBN ఇ-బైక్ 100కి పైగా ఫిజికల్ రిటైల్ పాయింట్‌లలో ఏర్పాటు చేయబడింది. ఎల్లో, బ్లూ, రెడ్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Removable battery system..

Motovolt అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ BIS ఆమోదించబడిన తొలగించగల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీన్ని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. బైక్‌ను ఇంటి బయట పార్క్ చేసి, ఇంట్లో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. రెండు బ్యాటరీలు తీసుకుంటే.. ఒకటి స్కూటర్‌లో పెట్టుకుని బయటకు వెళ్తే.. రెండోది ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఇందులో పెడల్ అసిస్ట్ సెన్సార్ ఉంది. ఇది బహుళ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఆటోమేటిక్ రైడ్ ప్రాధాన్యతలను ఎంచుకోవచ్చు. ఇగ్నిషన్ కీ, హ్యాండిల్ లాక్ సేఫ్టీని కలిగి ఉంది.

Specifications..

URBN ఇ-బైక్ పొడవు 1,700mm, వెడల్పు 645mm మరియు ఎత్తు 1010mm. దీని బరువు 40 కిలోలు. 120 కిలోల బరువును మోయగలదు. URBN ఇ-స్కూటర్ కేవలం 10 సెకన్లలోపు 25 kmph వేగాన్ని అందుకోగలదు.

ఇందులోని బ్యాటరీ లిథియం అయాన్ రకం. పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని రేంజ్ 120 కిలోమీటర్లు. ఇందులో మోటార్ కెపాసిటీ 36 వోల్ట్స్. BLDC రకం 20 అంగుళాల చక్రాలతో వస్తుంది. ఇందులోని మోటార్ 35Nm నుండి 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Flash...   ఎనిమిదేళ్ల గారెంటీ తో ఓలా Ev స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 198 Km.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. సస్పెన్షన్‌లో ముందు భాగంలో స్ప్రింగ్ యూనిట్లు మరియు వెనుక వైపున హైడ్రాలిక్ కాయిల్ స్ప్రింగ్‌లు ఉన్నాయి. ఇవి రైడర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నగరంలో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలు ఇంటి అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇది తక్కువ వేగం గల స్కూటర్ కాబట్టి, లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.