జామలో రకరకాలు ఉన్న సంగతి తెలిసిందే. అందరూ ఎక్కువగా తెలుపు మరియు గులాబీ రంగు జామ కాయలను తింటారు. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా గులాబీ రంగు జామ కాయలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. నల్ల జామ కాయలు కూడా ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించవు. పింక్ కలర్ జామలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు జామకాయను తింటే చాలా రకాల వ్యాధులు అదుపులో ఉంటాయి.
జామలో రకరకాలు ఉన్న సంగతి తెలిసిందే. అందరూ ఎక్కువగా తెలుపు మరియు గులాబీ రంగు జామ కాయలను తింటారు. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా గులాబీ రంగు జామ కాయలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. నల్ల జామ కాయలు కూడా ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించవు.
పింక్ కలర్ జామలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు జామకాయను తినడం వల్ల అనేక రకాల వ్యాధులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుంది.
పింక్ కలర్ జామపండు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జామకాయలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు, గీతలు రావు.
పింక్ జామలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మెదడు పనితీరు కూడా బాగుంటుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
అలాగే పింక్ జామ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు గులాబీ జామ తింటే బరువు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా కొద్ది మొత్తంలో కూడా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.