Rains : ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Rains : ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక, ఆదివారం నుంచి ఏపీలోని రెండు జిల్లాల్లో వర్షాలు ప్రారంభం కాగా,
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తమిళనాడు సరిహద్దులోని రాయలసీమలోని పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే ఇక్కడ వర్షం మొదలైంది. ఇప్పటికే ఈ వర్షం కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు చలి, మరోవైపు వర్షంతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

తిరుపతికి నేడు భారీ వర్ష సూచన:

ఏపీలోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

ఈరోజు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 24.6, తిరుపతి జిల్లా తడలో 16.8, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 12.2, తిరుపతి జిల్లా గూడూరులో 10 మి.మీ వర్షపాతం నమోదైంది.

Flash...   Geomagnetic storm: సూర్యుడిలో భారీ విస్ఫోటనం.. గంటకు 2.85 లక్షల కి.మీ. వేగంతో గురువారం భూమిపైకి సౌర తుఫాను