Realme Note 50 4G: రూ. 7 వేలలో సూపర్ ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫోన్‌..

Realme Note 50 4G: రూ. 7 వేలలో సూపర్ ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫోన్‌..

స్మార్ట్ ఫోన్ దిగ్గజాలన్నీ బడ్జెట్ మార్కెట్ లక్ష్యంగా కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వినియోగదారులను ఆకర్షించేందుకు చైనా దిగ్గజాలు బడ్జెట్ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

ఈ క్రమంలో Realme కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ రియల్ నోట్ 50 పేరుతో విడుదల కానుంది.

ఈ 4G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కొన్ని ఫీచర్లు మరియు ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ బడ్జెట్ తో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? ధర ఎంత? ఇలాంటి పూర్తి వివరాలు మీకోసం..

Realme Note 50 స్మార్ట్‌ఫోన్ UniSoc ప్రాసెసర్‌తో ఆధారితమైనది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఉంటుందని సమాచారం. అలాగే, RAMని 4G వరకు పొడిగించవచ్చు.

Realme Note 50 స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే, ఇది 66.7-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను అందిస్తుందని నివేదించబడింది. కెమెరా విషయానికి వస్తే, Realme Note 50 స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది.

అలాగే, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్‌లతో కూడిన ఫ్రంట్ కెమెరా అందించబడుతుంది. ఈ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా స్లాట్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని తెలుస్తోంది. ధర విషయానికొస్తే,

ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 7 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఫీచర్లను కంపెనీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే, Realme C67 స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 13,999.

Flash...   5G Phone Offer: రూ.485 కట్టి మీరు 5జీ ఫోన్ పొందవచ్చు , నమ్మలేని ఈఎంఐ ఆఫర్!