SBI, HDFC బాటలోనే మరో 3 బ్యాంకుల షాకింగ్ నిర్ణయం.. ఎక్కువ కట్టాల్సిందే

SBI, HDFC బాటలోనే మరో 3 బ్యాంకుల షాకింగ్ నిర్ణయం.. ఎక్కువ కట్టాల్సిందే

వడ్డీ రేట్లు:
కొత్త సంవత్సరంలో బ్యాంకులు విభిన్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతుండగా, అదే సమయంలో రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. మొట్టమొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ పెంచగా, అదే విధంగా మరో 4 బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. అదేంటో చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేట్లను 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం పలు బ్యాంకులు రుణ రేట్లను పెంచడం గమనార్హం. సాధారణంగా, RBI రెపో రేట్లను పెంచినప్పుడు, రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు పెరుగుతాయి. అదే సమయంలో, FD వడ్డీ రేట్లు పెరుగుతాయి. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వేళ చాలా బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. రుణ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.

ముందుగా దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ (SBI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. MCLR అనేది బ్యాంకులు రుణాలపై విధించే కనీస వడ్డీ రేటు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి వీలు లేదు. ఈ MCLR పెరిగితే, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు మొదలైన వాటిలో EMI పెరుగుతుంది.

SBI డిసెంబర్ 2023 నెలలో MCLR వడ్డీ రేట్లను పెంచింది. ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్నవారికి ఇది 8.65 శాతం నుండి 8.85 శాతానికి పెరిగింది. ఎలక్ట్రిక్ కార్లపై కనీస రుణ రేటు 8.75 శాతం. ఆ తర్వాత ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. HDFC బ్యాంక్ 6 నెలల MCLR రేటును 9.20 శాతానికి పెంచింది. ఇది జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఓవర్ నైట్ MCLR 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.80 శాతానికి, 3 నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9 శాతానికి చేరుకుంది. ఒక సంవత్సరం కాలపరిమితి MCLR కూడా 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.25 శాతానికి చేరుకుంది.

Flash...   Axis బ్యాంక్‌ ఖాతాదారులకు శుభవార్త! నెంబర్‌లెస్‌ క్రెడిట్‌ కార్డ్‌ విడుదల..బోలెడు లాభాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఎంపిక చేసిన కాల వ్యవధిలో MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఓవర్‌నైట్ MC
LR 8.20 శాతం నుండి 8.25 శాతానికి పెరిగింది. ఇందులో ఏడాదికి ఎంసీఎల్‌ఆర్‌ 8.70 శాతం.

బ్యాంక్ ఆఫ్ బరోడా కారు రుణాలపై వడ్డీ రేట్లను 8.70 శాతం నుంచి 8.80 శాతానికి పెంచింది. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 11.25 శాతం.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కూడా జనవరి 8 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోంది.దీనిలో వడ్డీ రేట్లు పెరిగాయి.. ఇప్పుడు ఓవర్‌నైట్ మరియు ఒక నెల MCLR రేట్లు 9.50 శాతం.. ఒక సంవత్సరం కాలపరిమితి MCLR 10.25 శాతం.