TCS NQT నియామక ప్రక్రియ 2024 :
ఫ్రెషర్‌లకు TCS శుభవార్త. ఒక్క పరీక్ష రాయడం వల్ల ప్రఖ్యాత ఐటీ, ఐటీయేతర కంపెనీల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
TCS National Qualifier Test 2024:
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ‘డిజిటల్ హైరింగ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆఫ్ క్యాంపస్ పరీక్షకు అర్హులైన అభ్యర్థుల నుంచి టీసీఎస్ ఎన్‌క్యూటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి TCS, TVS Motors, Jio, Asian Paints సహా 3000కు పైగా IT మరియు ITయేతర కార్పొరేట్ సంస్థల్లో సుమారు 1.6 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
ఉద్యోగం యొక్క స్వభావాన్ని బట్టి, గరిష్టంగా రూ.19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీలు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను ఎంపిక చేసుకుంటాయి. అర్హులైన విద్యార్థులు 2 జనవరి 2024లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
. దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 14న పరీక్ష నిర్వహించబడుతుంది.
Who is eligible?
2018 – 2024 మధ్య ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు డిగ్రీ, పీజీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా TCS NQT పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్లకు మించని పని అనుభవం ఉన్నవారు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
Age Limit:
పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
Application Procedure:
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Key Information:
దేశవ్యాప్తంగా వివిధ నిర్దేశిత పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ఆంగ్లంలో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను ఒక సంవత్సరం పాటు పరీక్ష రాయడానికి అనుమతించరు.
TCS NQTలో పొందిన స్కోర్ రెండేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి అవసరమైనన్ని సార్లు పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోర్ మాత్రమే పరిగణించబడుతుంది. పరీక్ష రాసిన తర్వాత, ఫలితం మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది. మీరు మీ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు అంటూ ఏమీ ఉండవు.
అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ని చూపించడానికి ఈ పరీక్షకు కట్ ఆఫ్ స్కోర్ లేదా పాస్/ఫెయిల్ ప్రమాణాలు లేవు. వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి స్కోరు ఇస్తారు.
ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
Official Website for register: https://www.tcsion.com/hub/national-qualifier-test/