ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు – ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు – ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ఉపాధ్యాయులు లేకుండా పోలింగ్ సజావుగా జరగదు అని అందరికి తెలిసిన సత్యమే.. పోలింగ్ ముందు రోజు నుంచి పోలింగ్ జరిగిన మరుసటి రోజు వరకు పోలింగ్ సామాగ్రి పక్కా లెక్కలతో అప్పజెప్పటం వరకు టీచర్ లకు ఉన్న బాధ్యత మరియు నేర్పరి తనం ఇంకా ఏ ఉద్యోగులకి కూడా లేదనేది జగమెరిగిన సత్యం..

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను DEO లు సేకరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది సరిపోరనే అంశం CEC రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రస్తావనకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులకు CEO మీనా తగిన ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న CEO సూచనల మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా ఉపాధ్యాయులను నియమించనున్నారు. దీంతో జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సిబ్బంది వివరాలను సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు పంపుతున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన వివరాలను ప్రత్యేక ఫారంలో నింపి ఎన్నికల అధికారులకు పంపిస్తున్నారు.

కాగా ఇప్పటికే అన్ని జిల్లాలలో ఇప్పటికే టీచర్ ల వివరాలు కలెక్టర్ కార్యాలయ NIC వారు సేకరించి ఉన్నారు.. గత ఎన్నికల్లో జరిగిన సిబ్బంది కొరత సర్దుబాటు ని ముందు నుంచే ప్లాన్నింగ్ ప్రకారం అరికట్టి ఎలక్షన్ కొరకు సరిపడా సిబ్బంది ని సమకూర్చే ప్రక్రియ లో భాగం గా అన్ని స్థాయిల ఉద్యోగుల వివరాలు NIC వారు ప్రతీక సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పటికే సేకరించి ఉంన్నారు.

కనుక రాబోవు ఎన్నికల్లో కూడా టీచర్ ల సేవలు తప్పకుండా అవసరం మరియు వీరి ఓట్లు కూడా గవర్నమెంట్ కి చాల కీలకం ఈ సారి..

Flash...   AP లో వచ్చే ఎలక్షన్ లో గెలిచేది ఎవరో తేల్చేసిన ప్రముఖ సర్వే !