WhatsApp: వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇంటర్నెట్ అవసరం లేకుండానే!

WhatsApp: వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇంటర్నెట్ అవసరం లేకుండానే!

ప్రతి స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్లలో వాట్సాప్ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ కావడం విశేషం.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఫీచర్లు వాట్సాప్ను అగ్రస్థానంలో నిలిపాయి.

వినియోగదారులకు మెరుగైన ఫీచర్లను అందించడం ద్వారా ఎంత పోటీ ఉన్నా వాట్సాప్కు వినియోగదారులు దూరం కావడం లేదు.

ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంలో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. హెచ్డీ క్వాలిటీతో ఫోటోలు/వీడియోలను షేర్ చేసుకునేందుకు గత ఏడాది వాట్సాప్ 2 జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కానీ ఇటీవల, మీరు ఇంటర్నెట్ అవసరం లేకుండా మీ చుట్టూ ఉన్న వారికి ఫోటోలు మరియు వీడియోలను పంపవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ OS ‘నియర్బై షేర్’ మరియు iOS ‘ఎయిర్ డ్రాప్’ లాగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. పూర్తయిన తర్వాత ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ Wabeta Info ఈ విషయాన్ని తెలిపింది.

కాగా, ఫొటోలు, వీడియోలు, ఆడియోలను చుట్టుపక్కల వారితో పంచుకునేందుకు ‘షేర్ ఇట్’ యాప్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ కేంద్రం ఈ యాప్ను బ్యాన్ చేయడంతో ఆండ్రాయిడ్ ఓఎస్లో నియర్బై షేర్ ఫీచర్ని యూజర్ల కోసం గూగుల్ తీసుకొచ్చింది. దీంతో వాట్సాప్ ఇటీవల నియర్బైకి పోటీగా ఫీచర్ను తీసుకురావడం ప్రారంభించింది.

Flash...   Best Photo Editing Apps: ఫొటో ఎడిటింగ్ ఇక చాలా ఈజీ.. ఈ యాప్స్‌తో ఫోన్లోనే సింపుల్ గా చేసేయండి..