నెలకు రూ. 1.51 వేల జీతం తో ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. అర్హతలు ఇవే..

నెలకు రూ. 1.51 వేల జీతం తో ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. అర్హతలు ఇవే..

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి ఇటీవల ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

అర్హత: బీఈ/బీటెక్ (సివిల్), బీప్లానింగ్/బీటెక్ (ప్లానింగ్), ఎంఏ (జాగ్రఫీ), పీజీ, టౌన్ ప్లానింగ్లో డిప్లొమా

ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01-07-2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 21.03.2024

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 10.04.2024

వెబ్సైట్: https://psc.ap.gov.in/

Flash...   Ap Govt Jobs 2024 : మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రభ్జుత్వ ఉద్యోగాలు..అప్లై చేసుకోండి లా