Currency: ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Currency: ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చనీయాంశమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్ నోట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.

అలాగే పేపర్ కరెన్సీ, ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ ఖర్చుపై పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు.

కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే ఆలోచన కొన్నేళ్ల కిందటే సెంట్రల్ బ్యాంక్ చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో దాదాపు పది లక్షల నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును నిలిపివేసింది.

Flash...   ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టం