DSC 2024 SGT Posts: ఆ అభ్యర్థుల ఫీజును వాపసు చేస్తాం: AP విద్యాశాఖ

DSC 2024 SGT Posts: ఆ అభ్యర్థుల ఫీజును వాపసు చేస్తాం: AP విద్యాశాఖ

SGT posts లకు దరఖాస్తు చేసుకున్న BED అభ్యర్థుల దరఖాస్తు రుసుమును వాపసు చేయనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ప్రకటించారు.

AP TET 2024 పరీక్ష | అమరావతి: Secondary Grade Teacher ((SGT ) పోస్టులకు BED అభ్యర్థులు అనర్హులంటూ AP High Court ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. BED SGT ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును వాపసు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని అభ్యర్థుల Aadhaar number తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు.

AP TET కు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి hall tickets website లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 120 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 76.5 శాతం మంది SGT అభ్యర్థులకు నచ్చిన తొలి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలపై ఏవైనా సందేహాలుంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం టెట్ , DSC helpdesk లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పనిచేస్తాయి. Help desk phone numbers 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997

Flash...   AP ప్రభుత్వ హాస్పిటల్ లో భారీ గా కాంట్రాక్టు ఉద్యోగాలు.. 7 మరియు 10 తరగతి తో..