EPF Interest Rate: ఉద్యోగులకు శుభవార్త.. EPF వడ్డీ రేటు భారీ గా పెంపు..

EPF Interest Rate: ఉద్యోగులకు శుభవార్త.. EPF వడ్డీ రేటు భారీ గా పెంపు..

2023-24 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి 10న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి.గత మూడేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

ఈ CBT నిర్ణయం త్వరలో కేంద్ర ఆర్థిక శాఖకు పంపబడుతుంది. ప్రభుత్వం నుండి అనుమతి పొందిన వెంటనే EPFO వడ్డీ రేటును అధికారికంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. వడ్డీ రేటు 2022-23కి 8.15 శాతం మరియు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించబడింది.

గత పదేళ్లలో EPF వడ్డీ రేట్లు..

  • 2013-14 : 8.75 percent
  • 2014-15 : 8.75 percent
  • 2015-16 : 8.8 percent
  • 2016-17 : 8.65 percent
  • 2017-18 : 8.55 percent
  • 2018-19 : 8.65 percent
  • 2019-20 : 8.5 percent
  • 2020-21 : 8.5 percent
  • 2021-22 : 8.1 percent
  • 2022-23 : 8.15 percent
Flash...   AP 'స్థానిక' ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల Gram panchayat Notification