హైస్పీడ్ ట్రైన్ వస్తోంది.. హైదరాబాద్ టూ విశాఖ ప్రయాణం ఎన్ని గంటలో తెలుసా!

హైస్పీడ్ ట్రైన్ వస్తోంది.. హైదరాబాద్ టూ విశాఖ ప్రయాణం ఎన్ని గంటలో తెలుసా!

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆంధ్రా, తెలంగాణ ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది.

ఈ మార్చిలోపు ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పీఈటీ) అధ్యయన సర్వే పూర్తవుతుంది. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్ర సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగైదు గంటల్లో విశాఖ చేరుకోవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఐదు నుంచి ఆరేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు వ్యయం రూ.20,000 కోట్లకు పైగా ఉంటుందని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సిన చోట పీఈటీ సర్వేను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎంచుకున్న మార్గాల ఇంజనీరింగ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం. హై స్పీడ్ రైలు కారిడార్కు రెండు ప్రతిపాదిత మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల్లో ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో హైస్పీడ్ రైలులో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే వివరాలను కూడా పీఈటీ సర్వే నివేదిక పేర్కొంది.

త్వరలో నిర్వహించనున్న డీపీఆర్ సర్వేకు 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ హైస్పీడ్ రైలు కోసం నేలపై నిర్మించిన పటిష్టమైన ట్రాక్ లను ఉపయోగించాలా లేక ఎలివేటెడ్ కారిడార్లను ఉపయోగించాలా అనే అంశంపై నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్కే ఎక్కువ మంది ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ ఖరారైతే… బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Flash...   ఫేషియల్ యోగా చేస్తే అందంగా మారతారా..