LIC : మీ పిల్లల భవిష్యత్ బంగారమే! అదిరిపోయే బెనిఫిట్స్..

LIC : మీ పిల్లల భవిష్యత్ బంగారమే! అదిరిపోయే బెనిఫిట్స్..

సంపాదించిన ఆదాయం లో కొంత మొత్తాన్ని ఆదా చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రోజులు అనుకూలమైనవని చెప్పలేము. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేం. అటువంటి సందర్భాలలో ఆదా చేసిన డబ్బు ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. అయితే invest చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది Life Insurance Corporation of India . ప్రభుత్వ రంగ LIC లో పొదుపు చేస్తే అధిక లాభాలు పొందడం ఖాయం. దీంతో LIC policies లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల పిల్లల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అద్భుతమైన ప్రయోజనాలను అందించేందుకు LIC Amrit Bal పేరుతో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది.

దేశీయ జీవిత బీమా సంస్థ LIC పిల్లల కోసం ప్రత్యేకంగా Amrit Bal policy ని ప్రారంభించింది. ఈ policy ద్వారా పిల్లలు తమ భవిష్యత్తు చదువులకు, ఇతర అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతారు. ఈ policy లో పెట్టుబడి పెడితే మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని పలువురు నిపుణులు అంటున్నారు. Amrit Bal Policy Plan Number 874. ఇది Non-Linked, Non-Participating, Individual, Savings, Life Insurance Plan February 17 నుంచి వినియోగదారులకు ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ జీవిత బీమా పథకంలో ఆదా చేసే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 80 అదనపు ఆదాయం.

Who is eligible, the benefits are:

Amrit Bal Policy అనేది పిల్లల కోసం ప్రవేశపెట్టిన Policy. ఈ Policy ని 30 రోజుల నుండి 13 సంవత్సరాల పిల్లలకు తీసుకోవచ్చు. Policy కి కనీస maturity వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు. LIC అమృత్ బాల్ పాలసీలో కనీస మొత్తం రూ. 2 లక్షల నుంచి ఆదా చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఐదు సంవత్సరాల నుండి ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు ఎంపిక చేసుకోవచ్చు. గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు మరియు వార్షికంగా ప్రీమియం చెల్లించడానికి వెసులుబాటు ఉంది.

Flash...   LIC Pension Policy: ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్

మీరు single premium చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలనుకుంటే, మీరు దానిని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ప్లాన్ కింద, మీరు కనీసం రూ. 2 లక్షల బీమా మొత్తం తీసుకోవాలి. మీరు 5వ, 10వ లేదా 15వ సంవత్సరంలో money back plan వంటి maturity settlement తీసుకోవచ్చు. ఈ policy లో పెట్టుబడిదారులు maturity పై హామీ ఇవ్వబడిన మొత్తం మరియు హామీతో కూడిన రాబడుల ప్రయోజనాన్ని పొందుతారు. పాలసీదారులు Some Assured on Death’ option ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఈ policy ద్వారా రుణాలు పొందవచ్చు.