LKG పిల్లల స్కూల్ ఫీజ్ రూ.4 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

LKG పిల్లల స్కూల్ ఫీజ్ రూ.4 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు. అందుకోసం వారు మంచి విద్యను అందించాలని భావిస్తున్నారు. అలాగే ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్థిరాస్తులు, ఆస్తులు కూడబెట్టడమే కాకుండా పిల్లల చదువుల కోసం డబ్బు వెచ్చిస్తున్నారు. ఎలాగైనా తమ పిల్లలను అత్యుత్తమ పాఠశాలల్లో చేర్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతను private పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని కొన్ని private పాఠశాలల్లో ఫీజుల ధరలు పెరుగుతున్నాయి. ఒక పాఠశాలలో రూ.4 లక్షలు ఉంది. అయితే పెద్ద తరగతికి అని అనుకుంటే పొరపాటే.. 1 కేజీ పిల్లలకు మాత్రమే ఈ ఫీజును వసూలు చేస్తోంది పాఠశాల.

ప్రస్తుతం వివిధ విద్యా సంస్థలు పిల్లల school ఫీజులను విపరీతంగా పెంచుతున్నాయి. పెరుగుతున్న ఫీజులను చూసి తల్లిదండ్రుల గుండెలు గుభేలుమంటున్నాయి. హైదరాబాద్లోని బాచుపల్లి ప్రాంతంలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి ఎల్కేజీలో చేరిన చిన్నారి ఫీజు విన్న తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చింది. 65 శాతం పెంచిన ఫీజు ఏకకాలంలో అమలు చేయడంపై తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 2023 విద్యా సంవత్సరంలో, పేర్కొన్న విద్యా సంస్థలో ఫీజులు 2.3 లక్షలు కాగా, 2024 సంవత్సరానికి దానిని 3.7 లక్షలకు పెంచారు. ఈ చిన్నారి april లో ఎల్కేజీలో చేరబోతున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం కూడా ఫీజులు పెంచడాన్ని సమర్థించిందని అన్నారు. ఐబీ పాఠ్యాంశాలను మార్చడమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు తెలిపారు.

మరో బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమారుడిని చేర్పించినప్పుడు ఒకటో తరగతి వరకు కూడా ఫీజు విధానం మారదని భావించామని, అయితే nursery నుంచి lkg కి అడుగు పెట్టేందుకు పాఠశాల యాజమాన్యం 65 శాతం ఫీజు పెంచిందని తెలిపారు. ఇదిలా ఉండగా, వారి పెద్ద కుమారుడు అదే పాఠశాలలో 4వ తరగతి చదువుతుండగా, అతని ఫీజు రూ. 3.2 లక్షలు అని వివరించారు. పాఠశాలను మార్చాలని భావించినా.. ఇంత తక్కువ సమయంలో బడిలో asmitions పొందడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ post viral గా మారింది.

Flash...   AP EAPCET 2022 NOTIFICATION RELEASED

Kukatpally పరిధిలోని పలు పాఠశాలలను ఒకటవ తరగతిలో చేర్పించేందుకు వెళ్లామని, అన్ని చోట్లా లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నామని మరో విద్యార్థి తల్లిదండ్రులు తమ బాధను చెప్పుకున్నారు. ఇంత ఫీజు ఎందుకు అని ప్రశ్నించగా.. మౌలిక వసతులు, భవనాలు చూపిస్తున్నారని అన్నారు. కాగా, ఫీజుల పెంపును school యాజమాన్యాలు సమర్థించుకుంటున్నాయి. Market లో అన్నింటి ధరలు పెరుగుతున్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఉంచుకోవాలంటే పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Hyderabad నగరంలోనే కాదు Bangalore, Mumbai, Delhi and Calcutta, వంటి నగరాల్లో కూడా స్కూల్ ఫీజులు లక్షల్లోనే ఉంటాయి. మొత్తంగా విద్యార్థుల ఫీజులు.. వారి తల్లిదండ్రులకు నిద్రలేని రాత్రులను ఇస్తున్నాయి. ఇక.. పిల్లల ఫీజులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. చాలా మంది ఆర్థికంగా చితికిపోవడానికి ఈ ఫీజులు కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.