Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి ఎగిరే కార్లు .. ఇంటిపైనే ల్యాండింగ్..!

Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి ఎగిరే కార్లు .. ఇంటిపైనే ల్యాండింగ్..!

సాంకేతికతలో విప్లవాత్మక మార్పులతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. AI సాంకేతికతతో AI యాంకర్లు కూడా పుట్టుకొచ్చారు. మనుషులు చేసే పనులన్నీ యంత్రాల ద్వారానే జరుగుతుందనడంలో సందేహం లేదు. సాంకేతికత పెరగడంతో వాహనాల్లో కూడా ఆధునిక ఫీచర్లతో Electric Vehicles పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు మనం రోడ్డుపై పరుగులు తీయడం మాత్రమే చూశాం. భవిష్యత్తులో ఎగిరే కార్లను కూడా చూడబోతున్నాం. ప్రముఖ కార్ల తయారీ సంస్థ Maruti electric air copters అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తే వాహనదారులకు traffic కష్టాల నుంచి విముక్తి కలుగుతుందనడంలో సందేహం లేదు.

దేశీయ automobile company Maruti Suzuki తన japan మాతృ సంస్థ Suzuki సహాయంతో గాలికి ఎగిరే కార్లను తయారు చేయాలని యోచిస్తోంది. electric air copters ను అభివృద్ధి చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ ఎగిరే కార్లు డ్రోన్ల కంటే పెద్దవి మరియు helicopters కంటే చిన్నవిగా ఉంటాయి. Electric విమానం బరువు కూడా తక్కువగా ఉంటుంది అంటే 1.4 టన్నులు. దీంతో ఎంపిక చేసిన ఇళ్ల పైకప్పులపై నే take off , దిగేందుకు వీలుంటుంది. ఎగిరే కార్లలో pilot సహా ముగ్గురు ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

Maruti Suzuki ఈ electric air copter రూపొందించే పనిలో ఉంది. Maruti Suzuki electric air copter ‘Sky Drive అని పేరు పెట్టనుంది. ఇది భారత మార్కెట్లో electric aircars ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉబర్ మరియు Ola cab services ల మాదిరిగానే Maruti Suzuki కి చెందిన electric air copter ‘ air taxi గా ఉపయోగించబడతాయి. ఈ electric air copter లను 2025 వరకు అందుబాటులోకి తెచ్చేందుకు Maruti Suzuki కీ చర్యలు చేపట్టగా.. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజా రవాణాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Flash...   మధ్యతరగతి కుటుంబానికి ఉత్తమ కారు ఇదే! ధర చాలా తక్కువ,మైలేజ్ సూపర్!