ఈ 6 జిల్లాల్లో దాదాపు 100 పైగా కంపెనీల తో 6000 ఉద్యోగాలు కొరకు మెగా జాబ్ మేళా ..

ఈ 6 జిల్లాల్లో దాదాపు 100 పైగా కంపెనీల తో 6000 ఉద్యోగాలు కొరకు మెగా జాబ్ మేళా ..

job mela మెగా జాబ్ మేళా ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువత

Rajamahendravaram Zone-2. పరిధిలోని ఐదు జిల్లాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 28న Rajamahendravaram లోని VLpuram Margani Estate Ground Job Mela నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథం ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీఎస్ మూర్తి తెలిపారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని న్యాక్ కార్యాలయంలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి Job Mela పై చర్చించారు. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులు హాజరై దాదాపు 6 వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.

ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి పేర్లు నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ Job Mela పై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో జిల్లా పరిషత్ అసిస్టెంట్ సీఈవో జీఎస్ రామ్ గోపాల్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.హరిశ్చంద్రప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి బి.వెంకటేశ్వరరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండల్ రావు, డివిజనల్ పీఆర్వో ఎంఎల్ ఆచార్య పాల్గొన్నారు.

Flash...   DCPO Notifications: బాలల సంరక్షణ సమితిలో ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది.