MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..

కర్ణాటకలోని మంగళూరులోని ONGC అనుబంధ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) E2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

అసిస్టెంట్ ఇంజనీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులు

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE/ B.Tech/ B.Sc ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023 స్కోర్ తప్పనిసరి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.

దరఖాస్తు రుసుము: రూ.118 (SC, ST, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

ఎంపిక ప్రక్రియ: గేట్-2023 మార్కులు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12/01/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10/02/2024.

Flash...   నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.