నెలకి లక్ష యాభై వేల జీతం తో ట్రాన్స్‌కో, జెన్‌కో లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నెలకి లక్ష యాభై వేల జీతం తో ట్రాన్స్‌కో, జెన్‌కో లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

Total Posts 08

  • Trasnco Directors: 03 posts
  • Genco Director : 05 posts

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తులను నింపి మార్చి 1వ తేదీలోపు విద్యుత్ సౌధలోని సీఎండీ కార్యాలయానికి పంపాలని సూచించారు.దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతచేయాలి.

ఈ పోస్టులకు అభ్యర్థులు 62 ఏళ్లు మించరాదని, సంబంధిత విభాగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. కేంద్ర/రాష్ట్ర/ప్రభుత్వ సంస్థల్లో మొత్తం 25 ఏళ్ల పని అనుభవం అందులో పేర్కొనాలి. నామినీలు 2 సంవత్సరాల పాటు డైరెక్టర్లుగా కొనసాగుతారని, అవసరమైతే ఒక్కొక్కరికి రెండేళ్లు పొడిగింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏకంగా రూ. 1.50 లక్షల జీతం, రూ. 30 వేల ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు.

ట్రాన్స్కో డైరెక్టర్ పోస్టులకు cmd@tstransco.in, జెన్కో డైరెక్టర్ల పోస్టుల కోసం ఆన్లైన్లో cmd@tsgenco.co.inకు కూడా పంపవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది.

Flash...   డైరెక్ట్ జాబ్.. టెస్ట్ లేదు. ఆర్టీసీలో ఉద్యోగాలు. నెలకి 50 వేలు జీతం. వివరాలు ఇవే.