మన దేశంలోని ప్రధాన రంగాలలో Banking వ్యవస్థ ఒకటి. Reserve Bank of India కింద ప్రభుత్వ, private banks లు పని చేస్తూ ప్రజలకు అనేక రకాల సేవలను అందిస్తున్నాయి. Banking తమ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక offers , అవకాశాలు మరియు సౌకర్యాలను అందిస్తాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ State Bank of India తన ఖాతాదారులకు చక్కటి అవకాశం కల్పించింది. ఆ అవకాశం ఏంటో, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతిపెద్దది. ఇది తన వినియోగదారులకు అనేక రకాల సేవలను అందిస్తుంది. fixed deposit , గృహ రుణాలు మరియు ఇతర EMIలకు సంబంధించి SBI కీలక సమాచారాన్ని అందిస్తుంది. అదేవిధంగా, ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి SBI బ్యాంక్ తరచుగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కస్టమర్లకు తమ సేవలను సులభతరం చేసేందుకు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పథకాల విషయంలో SBI తన కస్టమర్లకు మంచి అవకాశం కల్పించింది.
ప్రధాన మంత్రి Jeevan Jyoti Bima Yojana (PMJJBY) మరియు ప్రధాన మంత్రి Suraksha Bima Yojana (PMSBY) పథకాలు వినియోగదారులు తమను తాము online లో నమోదు చేసుకోవచ్చని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పథకాల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా, SBI తన ఖాతాదారులకు ఈ రెండు పథకాల కోసం online లో నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.
మరియు ప్రధాన మంత్రి Jeevan Jyoti Bima Yojana పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే, పాలసీదారుని కుటుంబానికి రూ.2 లక్షలు అందుతాయి. ఇది పూర్తిగా term insurance plan మరియు ఎటువంటి maturity లేదా surrender లబ్ధిదారుని అందించదు. అలాంటి మరొక పథకం ప్రధాన మంత్రి Suraksha Bima Yojana , ఇది accident insurance పథకం. ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించినప్పుడు ఇది పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ప్రధానంగా ఒక సంవత్సరం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ digital enrollment అర్హులైన పౌరులందరికీ ఈ రెండు బీమా కవరేజీని విస్తరించడం మరియు ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉందని SBI బ్యాంక్ తెలిపింది.
Customer లు branch లేదా customer service point ను సందర్శించకుండానే వారి సౌలభ్యం మేరకు online ఈ పథకాల కింద నమోదు చేసుకోవచ్చు. Online లో నమోదు చేసుకునేటప్పుడు వినియోగదారులు Jan Suraksha portal లో వారి ఖాతా number మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి. అలాగే వారు తమ ప్రాధాన్య బ్యాంకుగా SBIని ఎంచుకోవాలి. ఈ దశలను పూర్తి చేసి, ప్రీమియం చెల్లించిన వెంటనే బీమా పత్రం రూపొందించబడుతుంది. SBI కస్టమర్లు రెండు పథకాలను online లో సులభంగా నమోదు చేసుకోవచ్చు. మరి..SBI తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.