కేంద్రం యెక్క ‘భారత్ రైస్’ సన్నబియ్యం కిలో రూ.29. ఎక్కడ కొనాలి?

కేంద్రం యెక్క ‘భారత్ రైస్’ సన్నబియ్యం కిలో రూ.29. ఎక్కడ కొనాలి?

కేంద్రం యెక్క ‘భారత్ రైస్’ సన్నబియ్యం కిలో రూ.29, ఆన్లైన్ లో ఎక్కడ కొనాలి? ఇలా ఆర్డర్ చెయ్యండి !

కిలో భారత్ రైస్ సన్నబియ్యం రూ.29కి లభించనుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు కేంద్రీయ భండార్ రిటైల్ సెంటర్లలో విక్రయిస్తుంది.

భారత్ రైస్ ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో కూడా అందుబాటులో ఉంటుంది. భారత్ బ్రాండ్ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బస్తాల్లో విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో భారత్ రైస్ నేటి నుండి అందుబాటులో ఉంటుంది. కిలో రూ.29కి లభించే ఈ బియ్యం 5, 10 కిలోల ప్యాక్‌లలో లభిస్తున్నాయి.

మొదటి దశలో, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే NAFED మరియు రెండవ దశ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ అంటే NCCFలలో అందుబాటులో ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు.

లేదా నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazar.com/product-tag/online-shopping  ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో పప్పులు, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, టమోటాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Flash...   Upma Benefits: ఉదయాన్నే ఉప్మాను టిఫిన్‌గా తింటే ఏమౌతుందో తెలుసా..?