AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో స్కూల్స్‌కు భారీగా వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..

AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో స్కూల్స్‌కు భారీగా వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..

ఈసారి పాఠశాలలకు వేసవి సెలవులు ముందుగానే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒంటిపూట ఓదులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి పాఠశాలలకు ముందస్తు సెలవులు ఇవ్వాలని ఏపీ విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం పాఠశాలలకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరుబయట, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పాఠశాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలలకు దాదాపు 50 రోజులు..?

APలో పాఠశాలల వేసవి సెలవులు 24 ఏప్రిల్ 2024న ప్రారంభమవుతాయి. కానీ ఈ వేసవి సెలవులు 13 జూన్ 2024 వరకు ఇవ్వబడే అవకాశం ఉంది. అంటే ఈసారి పాఠశాలలకు దాదాపు 50 రోజుల వేసవి సెలవులు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు పైన పేర్కొన్న తేదీల్లోనే పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

పదో తరగతి విద్యార్థులకు 60 రోజులు..?

ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేసవి సెలవులపై ఇంకా అధికారాన్ని ప్రకటించలేదు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసిన వెంటనే వేసవి సెలవులు రానున్నాయి. పదో తరగతి విద్యార్థులకు కూడా దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి.

Source : Sakshi Education news

Flash...   Classes for 7th Starts from 14th December