సమ్మర్ అని కూల్‌ డ్రింక్స్‌ తెగ తాగేస్తున్నారా? ఒక్క సారి ఈ వీడియో చూడండి!

సమ్మర్ అని కూల్‌ డ్రింక్స్‌ తెగ తాగేస్తున్నారా? ఒక్క సారి ఈ వీడియో చూడండి!

ఎండాకాలం వచ్చేసింది… ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకాకోలా డ్రింక్ బాటిళ్ల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ప్రకారం, కోకా కోలా లేబుల్స్ ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లలో ఒక వ్యక్తి పానీయం నింపుతున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఇదేనా.. ఎప్పుడు చూస్తారు?’ అంటూ ఆందోళనతో కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు కోకాకోలా ఫ్యాక్టరీలో తయారు చేసినా ఒకటేనని, బాత్‌రూమ్‌లో తయారు చేసినదానికి పెద్ద తేడా ఏంటని వ్యాఖ్యానించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోకాకోలాకు మరికొంతమంది ట్యాగ్ చేయడం గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడ ఉంది? ఏ ప్రదేశానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Flash...   ఫిబ్రవరి 1 నుంచి ఎండలు మొదలు అంట.. జాగర్త గా ఉండాలి .