అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే చాలు మీ అప్పులన్నీ మాయం !

అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి  వెళ్తే చాలు మీ అప్పులన్నీ మాయం !

సాధారణంగా మన భారతీయులు బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా దేవుణ్ణి మాత్రమే ముందుగా స్మరిస్తారు. భగవంతుడు కరుణిస్తే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయని నమ్మకం.

ఇలా అప్పుల బాధలు ఉన్నవారు ఈ ఆలయానికి వెళితే వారి కష్టాలు తీరుతాయి. అప్పులు కూడా తీరతాయనే నమ్మకం ఉంది. ఈ దేవుడి పేరు చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి.

ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఉంది. దీనిని తెలంగాణ తిరుపతి అంటారు. పూర్వం ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతిని వివాహమాడాడు. ఈ పెళ్లి ఖర్చుల కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. కానీ ఆ స్వామి ఋణం తీర్చుకోలేడు. ఋణం తీర్చుకోవడానికి గడువు దగ్గర పడుతుండడంతో స్వామివారికి ఆందోళన మొదలవుతుంది. అలా స్వామివారు భయంతో నిద్రపోతుంటే చిలుపూరు ప్రాంతమంతా కలలో కనిపించింది.

నిద్రలేచి చిలుకూరు గుట్ట వరకు నడిచి అక్కడ కొండపై ఉన్న గుహలోకి వెళ్లి స్వామివారి పెదవులతో తపస్సు చేస్తాడు. ఆ సమయంలో కుబేర స్వామి ప్రత్యక్షమై వారికి క్షమాపణలు చెప్పాడు. అయితే స్వామి చిలుపూరు గుట్టకు వెళ్లగానే అప్పులు తీరాయని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి అప్పులు వచ్చినా, మరేదైనా ఇబ్బందులున్నా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్నీ సిద్ధిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం.

Flash...   MAREDUMILLI: మైమరపించే మారేడుమిల్లి అందాలు... తప్పక చూడాల్సిన 5 ప్రదేశాలు