ఏపీలో విద్యార్థులకు ఒంటిపూట బడులు.. ప్రభుత్వ నిర్ణయం?

ఏపీలో విద్యార్థులకు ఒంటిపూట బడులు.. ప్రభుత్వ నిర్ణయం?

తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో March 15 నుంచి ఒకరోజు తరగతులు ప్రారంభం కానున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Half Day schools ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాలు ఒంటిపూట బడులు ప్రారంభిస్తుండగా, ఈసారి AP government ఒంటిపూట బడులు, క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నుంచి ఆసక్తికర డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండడంతో పాటు విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే ఒంటిపూట బడులు నిర్వహించాలని STU demand చేసింది.

అధికారులకు వినతిపత్రం అందజేయడంతో పాటు March 11వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని demand చేస్తూ.. విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేయాలని demand చేస్తున్నారు. 

 ఏపీ ప్రభుత్వం మాత్రం వేసవి సెలవులతోపాటు Half Day schools పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. April 25 నుండి June 11 వరకు వేసవి సెలవులు ప్రకటించబడతాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత తరగతులు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథావిధిగా ఉదయం తరగతులు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని వెల్లడించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో March 11 నుంచి Half Day schools ప్రకటించాలనే డిమాండ్ ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Flash...   Diwali 2023 : దీపావళి పండుగ సెలవు ఎప్పుడంటే..?