టీచర్ అటెండన్స్ సరిగా వేయటం లేదని టీచర్ సస్పెండ్ .. FACIAL హాజరు తప్పకుండా వేయాలి..

టీచర్ అటెండన్స్ సరిగా వేయటం లేదని టీచర్ సస్పెండ్ .. FACIAL హాజరు తప్పకుండా వేయాలి..

ఉపాధ్యాయలు ప్రతి రోజు తప్పని సరిగా రెండు పూటలా ముఖ హాజరు వేయవలెనని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంత మంది ఆశ్రర్ధ వహిస్తుండటం ఫలితం గా ఈ రోజు ఏలూరు జిల్లాలో ఒక టీచర్ ను జిల్లా విద్యా శాఖాధికారి వారు సస్పెండ్ చేయటం జరిగింది.

సదరు టీచర్ రోజు విదియగా హాజరు నమోదు చేయక పోవటం, కొన్ని సార్లు ఒక్క పూట మాత్రమే హాజరు వేయటం గమనించి న కమాండ్ కంట్రోల్ రూమ్ వారు వీరి రికార్డు పరిశీలన నిమిత్తం అధికారులకి పంపిన నేపథ్యం లో జిల్లా విద్యా శాఖాధికారి పరిశీలించి అది నిజమని నమ్మిన తరువాత ఆ టీచర్ పై సస్పెన్షన్ వేటు వేయటం జరిగింది.

సస్పెన్షన్ కి కారణాలు

  • రోజు ముఖ హాజరు వేయక పోవటం
  • అప్పుడప్పుడు ఒక్క పూట మాత్రమే హాజరు వెయ్యటం
  • లీడర్ షిప్ ట్రైనింగ్ కి అటెండ్ కాకపోవటం
  • MDM రోజు వారి రిపోర్ట్ లు పెట్టక పోవటం
  • లీవ్ లెటర్ పెట్టకుండా సెలవు తీసుకోవటం
    సెలవు విషయం లో ప్రధానోపాధ్యాయులతో గొడవ పడటం
  • రెండు తరగతులు మాత్రమే బోదిస్తా అనటం
  • FA మార్కులు ఆన్లైన్ చేయక పోవటం

అదే కాకుండా గతం లో ఈ టీచర్ leadership ట్రైనింగ్ కు హాజరు అవ్వకపోవటం కూడా గమనించటం జరిగింది. ఈ టీచర్ పై Andhra Pradesh Civil Services (CC&A) Rules, 199 ప్రకారం విధుల నుంచి సస్పెండ్ చేయటం జరిగింది .

పై సంఘటన ప్రకారం ప్రతి టీచర్ ముఖ హాజరు ని సీరియస్ గ తీసుకుని తప్పకుండ రెండు పూటలా వేసేలా ప్రత్యేక శ్రర్ధ వహించాలి.

Flash...   TELUGU 6 - 10 CLASSES LESSON PLANS