మధ్యతరగతి కుటుంబానికి ఉత్తమ కారు ఇదే! ధర చాలా తక్కువ,మైలేజ్ సూపర్!

మధ్యతరగతి కుటుంబానికి ఉత్తమ కారు ఇదే! ధర చాలా తక్కువ,మైలేజ్ సూపర్!

భారతదేశంలోని ఒక మధ్యతరగతి కుటుంబం కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి మదిలో మెదిలే మొదటి ఆలోచన ఏమిటంటే.. ఎక్కువ మైలేజీ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఉన్న కార్లు ఏవి?.

మారుతీ సుజుకి కార్లు ఈ అవసరాలను తీరుస్తాయని చాలా మంది అంటున్నారు. 5-6 లక్షల బడ్జెట్‌లో వస్తున్న మారుతీ సుజుకి కార్లు ఇండియన్ మార్కెట్లో సామాన్యులకు చాలా ఫేమస్. అయితే ఇప్పుడు మరికొన్ని కంపెనీలు కూడా బడ్జెట్ సెగ్మెంట్లో మంచి మోడళ్లను అందిస్తున్నాయి. మైలేజ్, పెర్ఫామెన్స్, సేఫ్టీ పరంగా కూడా చాలా మంచి కారును కలిగి ఉన్న కంపెనీలలో టాటా ఒకటి.

మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి బడ్జెట్ కార్ల విభాగంలో టాటా టియాగో ముందుంది. టాటా టియాగో కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాని సేఫ్టీ రేటింగ్. దీనికి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది.

సేఫ్ కార్లపై ప్రజల్లో ఆసక్తి పెరిగిన సంగతి తెలిసిందే. కానీ బడ్జెట్ సెగ్మెంట్లోని ఇతర కార్లు భద్రత విషయంలో అంతగా అభివృద్ధి చెందలేదు. .కానీ, టాటా టియాగో.. బడ్జెట్ సెగ్మెంట్ కారు అయినప్పటికీ మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.. NCAP క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్లను పొందింది. మార్కెట్లో టాటా టియాగో రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.

టాటా టియాగో ఇంజన్

ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 86బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు CNG ఎంపికలో కూడా వస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మైలేజీ విషయానికి వస్తే.. కంపెనీ ప్రకారం, పెట్రోల్‌పై దాని మైలేజ్ 19.01kmpl. అదే సమయంలో ఇది ఒక కిలో సిఎన్‌జితో 26.49 కి.మీ వరకు నడపగలదు.

ఇతర లక్షణాలు

ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వెనుక డీఫాగర్, బ్యాక్ వైపర్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇందులో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, EBDతో కూడిన ABS, ప్రయాణీకుల భద్రత కోసం కార్నర్రింగ్ స్టెబిలిటీ కంట్రోల్ సపోర్ట్ ఉన్నాయి.

Flash...   రికార్డ్ సేల్స్..ఏడాదిలోనే 38 లక్షల కార్లు అమ్మకం