Digital payment సౌకర్యం అందుబాటులోకి రావడంతో చెల్లింపులు మరింత సులువుగా మారాయి. Unified Payment Interface (UPI) online లావాదేవీలను సులభతరం చేసింది. మీ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, మీ బ్యాంకు ఖాతాలో నగదు ఉంటే, మీరు UPI సహాయంతో లావాదేవీలు చేయవచ్చు. Google Pay మరియు Phone Pay వంటి Digital చెల్లింపుల యాప్లను ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్లలో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇప్పుడు UPI సేవలు మరింత సులభతరం కానున్నాయి. బ్యాంక్ ఖాతాతో పని లేకుండా చెల్లింపులు చేయడానికి కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని Mobikwik పరిచయం చేసింది.
మీరు చాలా online చెల్లింపులు చేస్తున్నారా? కానీ ఇప్పుడు మీరు మీ ఖాతాను లింక్ చేయకుండానే చెల్లింపులు చేయవచ్చు. Domestic payment service provider Mobiquik దీనికి సంబంధించిన కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాకు లింక్ లేకుండా చెల్లింపులు చేయడానికి పాకెట్ UPI అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పాకెట్ UPI feature ఖాతాను లింక్ చేయకుండా MobiKwik వాలెట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాంకు ఖాతాకు బదులుగా వాలెట్కు నిధులను బదిలీ చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. Mobikwik బ్యాంక్ ఖాతా నుండి నిధులను బదిలీ చేయడం కంటే Mobikwik వాలెట్ నుండి బదిలీ చేయడం సురక్షితమైనదని మరియు ఆర్థిక మోసాలకు అవకాశం లేదని పేర్కొంది