ప్రముఖ హీరో కొడుకుతో … పబ్‌లో సాయిపల్లవి చిందులు .. viral video

ప్రముఖ హీరో కొడుకుతో … పబ్‌లో సాయిపల్లవి చిందులు .. viral video

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా నుంచే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. తెలుగులో తన తొలి చిత్రం ఫిదా నుంచి ఇటీవల విడుదలైన విరాటపర్వం వరకు అన్ని రకాల పాత్రల్లో తన అభిమానులను అలరిస్తూనే ఉంది.

సాయి పల్లవి డ్యాన్స్ అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పాలి. తెలుగు, తమిళం, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ అత్యంత ప్రతిభ గల కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టానా సినిమా ఓకే కాదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సాయి పల్లవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక సాయి పల్లవి హద్దులు దాటే గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది. అదే సాయి పల్లవికి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టింది. సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతోంది.

రీసెంట్ గా జపాన్ లో షెడ్యూల్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ అక్కడ చిన్న పార్టీ చేసుకుంది. చిత్ర యూనిట్‌తో సాయి పల్లవి చిందులు వేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ పబ్‌లో ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో సాయి పల్లవి మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. టీమ్‌లో ఒక్కతే ఆడపిల్లే అయినప్పటికీ ఎలాంటి అండదండలు లేకుండా ఊరమాస్‌ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Flash...   Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు చిరంజీవి కి అవన్నీ ఫ్రీగా ఇస్తారా?