One Student – One ID : కేజీ టు పీజీ దేశంలోని స్టూడెంట్స్ అందరికీ ఒకే ID !

One Student – One ID : కేజీ టు పీజీ దేశంలోని స్టూడెంట్స్ అందరికీ ఒకే ID !

వన్ స్టూడెంట్ – వన్ ఐడీ: దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ నంబర్ ఆధార్ నంబర్‌తో ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‘ (ABC) EduLockerకి లింక్ చేయబడుతుంది. ఈ విధానం త్వరలో అమలులోకి రానుంది. దీంతో మన దేశంలోని విద్యార్థులందరి సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఈ విధానాన్ని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ‘చైల్డ్ ఇన్ఫో’ పేరుతో ఒక్కో విద్యార్థికి ఒక్కో నంబర్ సిస్టమ్ అమలవుతోంది. త్వరలో కేంద్ర విధానం అమల్లోకి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ ఇన్ఫో నంబర్ కేటాయించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంఖ్య మాత్రమే సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు 26 కోట్ల మంది విద్యార్థులు ఉన్నందున 17 అంకెల నంబర్‌ను ఐడీ నంబర్‌గా కేటాయించే అవకాశం ఉంది.

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ (UDICE) ద్వారా అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా కేంద్రం విద్యార్థులకు ID నంబర్లను కేటాయిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే.. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, చదువు మానేసినా వారి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. కొత్త జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న నిబంధన ప్రకారం, వన్ స్టూడెంట్ వన్ ఐడి నంబర్ అమలు చేయబడుతోంది. దీన్ని అమలు చేసే బాధ్యతను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌కు అప్పగిస్తారు. ఏఐసీటీఈ మాజీ చైర్మన్‌ ఆచార్య సహస్రబుద్దే ఈ ఫోరమ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది అమల్లోకి రాగానే.. విద్యార్థులకు కేటాయించిన ఐడీ నంబర్‌ను నమోదు చేయగానే.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, స్కిల్స్, స్కాలర్‌షిప్‌లు అందిన వివరాలన్నీ కనిపిస్తాయి. వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే సమయంలో డిజిటల్‌గా సర్టిఫికెట్లను సరిచూసుకుని సీటు (వన్ స్టూడెంట్ – వన్ ఐడీ) ఇచ్చే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో ఈ నంబర్‌ను నమోదు చేస్తే సరిపోతుంది.

Flash...   ENABLING OF ACCOUNT CORRECTIONS FOR STUDENTS IN NS PORTAL