కేంద్రం సూపర్ స్కీమ్.. విద్యార్థులకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌ పొందే ఛాన్స్

కేంద్రం సూపర్ స్కీమ్.. విద్యార్థులకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌ పొందే ఛాన్స్

కేంద్రం సూపర్ స్కీమ్.. విద్యార్థులకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌ పొందే ఛాన్స

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కేంద్రం ఈ పథకాలను అమలు చేస్తోంది.

అన్ని వర్గాలకు చదువుకునే అవకాశం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాల విద్యను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేంద్ర శాఖ శ్రేష్ట అనే పథకాన్ని అమలు చేయడం గమనార్హం.

లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కోసం పథకం ఈ పథకం అధిక-నాణ్యత విద్య మరియు సమగ్ర అభివృద్ధికి అవకాశాలను అందిస్తుంది. ఎస్సీ విద్యార్థులకు సాధికారత కల్పించడం ద్వారా విద్యా అంతరాన్ని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు శ్రేష్ట కోసం జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా శిక్షణ పొందుతారు.

ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు 9వ తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చు. వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న కుటుంబ సభ్యులకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ యువతకు ఎంతో మేలు చేస్తోంది.

కేంద్రంలోని పథకాలపై పూర్తి అవగాహన ఉన్నవారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకొని పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సు కూడా ఉంటుందని బోగట్టా. పాఠశాల ఫీజులు మరియు రెసిడెన్షియల్ ఛార్జీలను కవర్ చేయడానికి గ్రాంట్లు కేటాయించబడతాయి, ఇది విద్యార్థులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

Flash...   ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!