AMMA VODI 2022 RULES: విద్యార్థులకు అలర్ట్.. అమ్మఒడికి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..!


అమ్మఒడి పథకం కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకుంటోంది. తెల్ల రేషన్ కార్డు, పల్లెల్లో నెలకు రూ.10వేల లోపు ఆదాయం, ఐటీ రిటర్న్స్ చెల్లించని వారు, ఫోర్ వీలర్ వాహనం లేనివారు ఇలా పలు రూల్స్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నగదు జమ చేస్తోంది

2020, 2021లో జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. 2022లో హాజరను ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చి జూన్ నెలకు వాయిదా వేసింది. దీనిపై తల్లిదండ్రులకు సమాచారం అందిస్తోంది. అంతేకాదు కొత్త రూల్స్ ని కూడా గుర్తుచేస్తోంది

లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల కంటే వినియోగిస్తే అమ్మఒడి పథకం వర్తించదని స్పష్టం చేసింది. 300 లోపు విద్యుత్ వినియోగం ఉంటేనే నగదు అందుతుంది. ఈ మేరకు అర్హతలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

అంతేకాదు గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు హాజరు 75శాతం కంటే తక్కువగా ప్రయోజనం రాదు, అలాగే కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవలసి ఉంటుంది. అలాగే ఆధార్.. బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఎకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది

అంతేకాదు గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు హాజరు 75శాతం కంటే తక్కువగా ప్రయోజనం రాదు, అలాగే కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవలసి ఉంటుంది. అలాగే ఆధార్.. బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఎకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ వివరాలు అంటే వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేకుంటే వాలంటీర్ వద్ద e-KYC ద్వారా అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది.

Flash...   Election remuneration to the poling staff of GP

ప్రభుత్వం గత ఏడాది నుంచి అమ్మఒడి పథకంలో స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ అందిస్తోంది. ఇందుకోసం విద్యార్థుల తల్లుల నుంచి డిక్లరేషన్ తీసుకొని ల్యాప్ టాప్ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది

AMMA VODI WEBSITE